‘బాహుబలి 2’ అధ్భుత విజయంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆలోచనలు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు అన్ని భాషలకు సంబంధించిన సినిమా రంగాలలోను అత్యంత భారీ సినిమాల నిర్మాణ ప్రకటనలతో మీడియా హోరెత్తి పోతోంది. ‘మహాభారతం’ ‘రామాయణం’ ‘ఛత్రపతి శివాజీ’ ‘మణికర్ణిక’ ఇలా రకరకాల భారీ ప్రాజెక్ట్స్ వందల కోట్ల పెట్టుబడితో ప్రకటింపచ బడుతున్నాయి. 

ఈసినిమాలలో ఎన్ని నిజంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవుతాయో తెలియకపోయినా ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా భారీ సినిమాల నిర్మాణ వార్తలే. ఇలాంటి పరిస్థుతులలో తాను కూడ ఈ రేస్ లో ఉన్నాను అంటూ రెండు మూడు రోజుల క్రితం అల్లు అరవింద్ ‘రామాయణం’ భారీ ప్రాజెక్ట్ గురించి ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 500 కోట్ల ఈ భారీ బడ్జెట్ మూవీలో ఎవరు నటిస్తారో ఇప్పటికి క్లారిటీ లేదు. 

అయితే మెగా అభిమానులు మాత్రం తమ ఊహలకు పదును పెడుతూ రామ్ చరణ్ ను ఈ భారీ మూవీలో శ్రీరాముడు గా ఊహించుకుని ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.  ‘మగధీర’ లోని రామ్ చరణ్ ఫేస్ ను రాముడి గెటప్ లోకి మార్చి ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. 

500 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈ త్రీడీ మూవీకి సంబంధించిన   ‘రామ్ చరణ్ యాజ్ రామ’ అంటూ నిజంగానే ఈసినిమా యూనిట్ వర్గాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారా అని అనిపించే విధంగా మెగా అభిమానులు ఈ పోస్టర్ తో తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ఈ హడావిడి చూసిన విమర్శకులు మాత్రం అల్లు అరవింద్ రామాయణం తీయడం ఎంతటి వాస్తవమో రాముడిగా రామ్ చరణ్ నటిస్తున్నాడనేది కూడా అంతే వాస్తవం అంటూ జోక్ చేస్తున్నారు.

అయితే ఏది ఎలా ఉన్నా తమ మెగా యంగ్ హీరో రామ్ చరణ్ కూడ 500 కోట్ల భారీ సినిమాలో నటిస్తూ నేషనల్ స్టార్ గా మారబోతున్నాడు అంటూ మెగా అభిమానులు కంటున్న పగటి కలలు కొంతమందికి ఆశ్చర్యాన్నీ మరికొంతమందికి నవ్వును తెప్పిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: