కుర్ర హీరోల్లో నిఖిల్ ఎంచుకునే కథలు అతను సినిమాల హిట్లు గురించి అందరికి తెలిసిందే. లాస్ట్ ఇయర్ డిమానిటైజేషన్ పీక్స్ లో ఉన్న టైంలో కూడా ఎక్కడికిపోతావు చిన్నవాడా అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు నిఖిల్. ఇక కెరియర్ లో సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ వెళ్తున్న నిఖిల్ సుధీర్ వర్మ డైరక్షన్ లో కేశవ సినిమాతో రాబోతున్నాడు.


స్వామిరారా తర్వాత ఈ ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమాగా కేశవ సూపర్ బజ్ ఏర్పరచుకుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా రీసెంట్ గా టీజర్ ఆ తర్వాత సాంగ్స్ రాగా ఇప్పుడు ఏకంగా ట్రైలర్ తో సినిమా హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యేలా అదరగొట్టాడు. అందరికి ఎడమపక్కన ఉండే గుండే కుడి పక్కన ఉంటే.. ఎలాంటి ఒత్తిడికైనా సరే చనిపోతాడని తెలిసి అతను రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది కేశవ కథ.  


కథ సింపుల్ గా చెప్పేసినా కథనంలో తన టాలెంట్ చూపించేశాడనిపిస్తుంది దర్శకుడు సుధీర్ వర్మ. టేకింగ్ పరంగా అద్భుతం అని ట్రైలర్ చూస్తేనే అనిపిస్తుంది. ఎవరేం అనుకున్నా సరే తాను మాత్రం అనుకున్న డేట్ మే 19కే రావడం ఖాయమని అంటున్నాడు నిఖిల్. ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న నిఖిల్ చూస్తుంటే ఇలానే స్టార్ క్రేజ్ దక్కించుకునేలా ఉన్నాడు.


ట్రైలర్ మాత్రం సింప్లీ సూపర్బ్.. సన్ని ఎం.ఆర్ మ్యూజిక్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని అనిపిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాలో పెళ్లిచూపులు ఫేం రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. మరి డిఫరెంట్ సినిమాలను తీస్తున్న నిఖిల్ ఈ కేశవతో కూడా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: