టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బ్యూటీ సమంత. అయితే ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న సమంత ర్యాంకింగ్, సేఫ్ లో ఉన్నట్టేనా? అంటే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే లేదనే అంటున్నారు కొందరు. ఎందుకంటే తాజాగా సమంత నటిస్తున్న సినిమాలలో తను ఎక్స్ పోజింగ్ రోల్స్ ని పూర్తిగా తగ్గించింది.


కేవలం ట్రెడిషనల్ గా ఉన్న పాత్రలనే చేయటానికి ఆసక్తి చూపుతుంది. దీంతో సమంతని కాదని ఇతర దర్శకులు వేరే హీరోయిన్స్ వైపు చూస్తున్నారు. ఆ విధంగా కాస్త ట్రెడిషనల్ గానూ, హాట్ గానూ కనిపించే హీరోయిన్స్ లిస్ట్ లో హెబ్బా పటేల్ ఒకరు ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శకులు హెబ్బా పటేల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు.


అందులోనూ సమంత నటించాల్సిన రోల్స్ లో హెబ్బా పటేల్ ని తీసుకోవాలని పలువురు హీరోలు కూడ ఆలోచిస్తున్నారంట. దీంతో హెబ్బా పటేల్ కి తన అవకాశాలు రాకుండా సమంత జాగ్రత్తలు తీసుకుంటుందని అంటున్నారు. సమంత డైరెక్టర్ గా ప్రముఖ దర్శకులకి ఫోన్ చేసి మరీ హెబ్బా పటేల్ కి ఇచ్చిన ఆఫర్స్ ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో న్యూస్ హల్ చల్ చేస్తుంది.


దీంతో టాప్ హీరోలు కూడ సమంత ఇంత గట్టిగా పట్టుబట్టడంతో హెబ్బా పటేల్ ని దూరం పెడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏదొక రోజు హెబ్బా పటేల్ కచ్ఛితంగా సమంత ఆఫర్స్ ని హైజాక్ చేయటం ఖాయం అని అంటున్నారు. ఇక ఈ హెబ్బా పటేల్ తాజాగా  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: