సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాడ్ ఫిల్మ్ హీరోగా మహేష్ బాబుకి మంచి పేరు ఉంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత బ్రాండింగ్ ఒక్క మహేష్ బాబుకి మాత్రమే ఉందని చెప్పవచ్చు. దాదాపు 7 సంవత్సరాల నుండి నేషనల్ యాడ్స్ అన్నీ మహేష్ బాబు ముంగిటే వాలుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒకే ఒక్క మూవీతో ప్రభాస్...మహేష్ స్థానాన్ని భీట్ చేస్తున్నాడని చెప్పవచ్చు.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... 'బాహుబలి' సిరీస్‌తో ప్రభాస్ భారీ పాపులారిటీని అందుకున్నాడు. దీంతో పలు యాడ్ కంపెనీలు ప్రభాస్ వైపు చూస్తున్నాయి. యాడ్ కంపెనీలకి కావాల్సింది...మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ. ఆ లక్షణాలు ఇప్పుడు ప్రభాస్ లో పుష్కలంగా కనిపిస్తున్నాయి.


ఇక సౌత్ మార్కెట్ లో అయిన ప్రభాస్ కి నెంబర్ వన్ స్థానం దక్కింది. అలాగే నేషనల్ పరంగానూ ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలోనే ఉన్నారు. దీంతో ప్రముఖ కంపెనీలు ఎండోర్స్ మెంట్ విషయంలో ప్రభాస్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా చేస్తున్నాడు. అలాగే మరోవైపు యాడ్స్‌ షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకూ మహేష్ బాబు చేతిలో 5 యాడ్స్ ఉన్నాయి.


కానీ తాజాగా ప్రభాస్ ప్రముఖ కంపెనీలతో 7 రకాల యాడ్స్ కి అగ్రిమెంట్ ని జరుపుకున్నాడని అంటున్నారు. వీటికి సంబంధించిన షూటింగ్ ప్రోగ్రెస్ ప్రస్తుతం నడుస్తుంది. మరో రెండు నెలల్లో ఈ యాడ్స్ అన్నీమార్కెట్ లోకి రానున్నారు. దీంతో సౌత్ మార్కెట్ లో ఎక్కువ యాడ్స్ ని కలిగిఉన్న హీరోగా ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలోకి రానున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: