ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో విషాదాలు బాగా చోటు చేసుకుంటున్నాయి.  చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి చేరుకుంటున్నారు.  ముఖ్యంగా ఆస్తి విషయాలు..అక్రమ సంబంధాలు ఇలా కుటుంబంలో పలు సమస్యలతో సినీ సెలబ్రెటీస్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  తాజాగా మరాఠీ నిర్మాత అతుల్ తాప్కిర్ ముంబైలోని ఓ హోటల్ రూమ్ లో విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారు జమున ఈ ఘటన జరిగింది. అయితే అత్మహత్యకు ముందు అతుల్ ఫేస్ బుక్ పేజిలో తానూ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాడు.

2015 లో రిలీజ్ అయి విజయం సాధించిన '' దోల్ తాషే '' చిత్రాన్ని నిర్మించిన  అతుల్ బి టప్కీర్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు కానీ డబ్బు మాత్రం సంపాదించలేక పోయాడు.   అయితే గత కొంత కాలంగా తన భార్య వేధింపులు తట్టుకోలేక పోతున్నానని సన్నిహితులతో తన ఆవేదన తెలిపినట్లు తెలుస్తుంది.  అతుల్ నిర్మించిన సినిమా హిట్ అయినప్పటికీ పెట్టిన పెట్టుబడి పూర్తిస్థాయిలో రాలేదు దాంతో కట్టుకున్న భార్య డబ్బంతా పోగొట్టవని చీటికీ మాటికీ దెప్పి పొడుస్తుండటమే కాకుండా తన సోదరులతో దాడి చేయించినట్లు సమాచారం.  
Image result for atul tapkir suicide
అతుల్ గత ఆరు నెలలుగా భార్య ప్రియాంక తో దూరంగా ఉంటున్నాడు . పది మంది ముందు చాలా అవమానకరంగా మాట్లాడటంతో ఇక బ్రతికి లాభం లేదనుకున్న అతుల్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు .  ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టినప్పటికీ ఆర్ధికంగా నష్టపోవాల్సి వచ్చిందని సదరు నిర్మాత తన ఫేసు బుక్ లో పోస్ట్ చేశాడని పోలీసులు చెబుతున్నారు.
Image result for atul tapkir suicide
సినిమా వల్ల నష్టపోయి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న తనకు తన తండ్రి, సోదరి చాలా సోపోర్టుగా నిలిచారని అతుల్ తాప్కిర్ ఆత్మహత్యకు ముందు ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. అయితే తానూ ఎందుకు చనిపోతున్నానో స్పష్టం చేస్తూ లేక రాయడమే కాకుండా సాక్ష్యాలతో కూడిన ఓ పెన్ డ్రైవ్ ని కూడా పేర్కొన్నాడు. అతుల్ తాప్కిర్ ఆత్మహత్య వెనక అసలు కారణాలు ఏమిటనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: