గతంలో స్టార్ హీరోయిన్ గా రమ్యకృష్ణ చేసిని మూవీలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు రమ్యకృష్ణ, రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సిరీస్ లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన ‘శివగామి’ పాత్ర ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ మర్చిపోలేని పాత్రగా నిలిచిపోయింది.


దీంతో దేశవ్యాప్తంగా రమ్యకృష్ణ కి ఎక్కడలేని క్రేజ్ క్రియోట్ అయింది. ఇదిలా ఉంటే బాహుబలి2తరువాత రమ్యకృష్ణ క్రేజ్ ని ఉపయోగించుకోవాలని పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకి సంబంధించిన వారు ఉన్నారు. వీరిలో బాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ప్రముఖంగా రమ్యకృష్ణ ముందు భారీ ఆఫర్స్ తో రెడీగా ఉన్నారు. అయితే రమ్యకృష్ణ సైతం తను ఒక్కో మూవీలో నటించేందుకు పలు కండిషన్స్ ని పెట్టడమే కాకుండా…భారీ రెమ్యునరేషన్ ని సైతం డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.


కేవలం రమ్యకృష్ణ కోసం కొత్త పాత్రల్ని క్రియేట్ చేసే దర్శకులు ఉండటం అనేది తన పాత్రకి ఉన్న డిమాండ్ ని చూపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న ‘తన్న సెరెంద కూటం’ అనే చిత్రంలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ అని అంటున్నారు. విభిన్నంగా, ఆసక్తికరంగా గతంలో చూడని రమ్యకృష్ణ ని ఈ మూవీలో చూపిస్తున్నారని అంటున్నారు. అయితే రెమ్యునరేషన్ పరంగా రమ్యకృష్ణ ఈ మూవీకి భారీగా వసూల్ చేస్తుంది.


దాదాపు 80 లక్షల వరకూ రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఉందని అంటున్నారు. ఇక తాజాగా ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి అయితే ఏకంగా కోటిరూపాయలను చార్జ్ చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ సైతం కోటీ రూపాయలు తీసుకోవటానికి ఎంతో గ్లామర్ ని చూపించాల్సిన పరిస్థితి ఉంది. కానీ కేవలం హావాభావాలతో, తన యాక్టింగ్ ప్రతిభతోనే రమ్యకృష్ణ భారీ రెమ్యునరేషన్ ని అందుకుంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: