ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న న్యూస్ ఏమైనా ఉందంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గురించే. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా గోదావరి జిల్లాలో ఈ మూవీ సంబంధించిన కీలక షెడ్యూల్ ని జరుపుంది.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ జరుగుతుంది. రామ్ చరణ్ ఎటువంటి రెస్ట్ లేకుండా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రావురమేష్ నటిస్తున్నారు. అయితే రావురమేష్, రామ్ చరణ్ కి సంబంధించిన కాంబినేషన్స్ సీన్స్ అవుట్ పుట్ సరిగా రావటం లేదట. దీనిపై దర్శకుడు సీరియస్ గా ఆలోచించి రావురమేష్ ని పక్కన పెట్టేశాడు.

దీంతో రంగంలోకి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎంటర్ అవుతారని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 2007 లో రిలీజైన ‘జగడం’ అనే సినిమాలో ప్రకాష్ రాజ్ నటించాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో మళ్ళీ నటిస్తున్నారు. అయితే గతంలోనూ గోవిందుడు అందరివాడే సినిమాలో ఓ పాత్ర సరిగా రాకపోతే ప్రకాష్ రాజ్ ని పిలిపించారు. ఇప్పుడు కూడ రావురమేష్ పాత్ర సరిగా రాకపోవటంతో ప్రకాష్ రాజ్ ని పెట్టాలని డైరెక్టర్ కి చరణ్ చెప్పారని అంటున్నారు.

అయితే ఈ విషయంలో చరణ్ పేరు బయటకు రాకుండా డైరెక్టర్ సుకుమార్ తీసుకున్న నిర్ణయంగా ఇది వినిపిస్తుంది. మొత్తంగా రావురమేష్ కి జరుగుతున్న గేమ్ ఏంటో అస్సలు అర్దం కావటం లేదని అంటున్నారు. ఇక ప్రకాష్ రాజ్ పాత్రను ప్రత్యేక శ్రద్ధతో సుకుమార్ రూపొందించినట్టు తెలుస్తుంది. అలాగే మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం కాస్త భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: