బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోకి సంబంధించిన గుట్టు రట్టయిందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తను ఈ మూవీలో పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ ని కొనసాగిస్తారు. దీంతో ఇండస్ట్రీలోకి చెందిన పలువురు హీరోయిన్స్ కథలో భాగంగా రణబీర్ కపూర్ తో డేటింగ్ చేయాల్సి ఉంది.


తాజాగా ఈ సీన్స్ కి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇక షూటింగ్ కి కొద్దిగా బ్రేక్ ఇచ్చిన రణబీర్ వెంటనే ఓ యువతితో పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చాడు. వీరిద్దరూ రొమాన్స్ లో మునిగి తేలుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలు ఓ యాడ్ కోసం అని ఫైనల్ గా తెలిసింది. వైరల్ గా మారిన ఫోటోలోని మోడల్ తో రణబీర్ కపూర్ నిజంగా డేటింగ్ చేస్తున్నాడనే టాక్స్ అంతటా వినిపిస్తున్నాయి.


ఇక ఆ మోడల్ ఓ అడుగు ముందుకువేసిందట. రణబీర్ కపూర్ ఎప్పుడైతే క్లోజ్ గా మూవ్ అవుతున్నాడో..ఈ బ్యూటీ ఇంకాస్త రెచ్చిపోయి రణబీర్ కపూర్ ని పెళ్లి వరకూ తీసుకువెళుతుందని అంటున్నారు. దీంతో ఆ మోడల్ తో కాస్త దూరాన్ని మెయింటెన్ చేయాలనుకున్నాడు ఈ హీరో.


ఇక ఆ మోడల్ మాత్రం తనతో టైం స్పెండ్ చేయకపోతే గుట్టురట్టు చేస్తానని అంటుందట. ఈ విషయం సీరియస్ గా మారకముందే మోడల్ ని కూల్ చేసేందుకు యంగ్ హీరో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక రణ్ భీర్ కపూర్ ఫిల్మ్ కెరీర్ ప్రస్తుతం కాస్త డల్ గానే ఉందని చెప్పాలి. అందుకే సరైన బ్రేక్ కోసం మంచి కథలపై దృష్టి పెట్టాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: