దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఎదిగారు. ఓ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ... అందులోనూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శకుడు అయిన రాజమౌళికి ఈ గౌరవం దక్కటంతో దీనిపై అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకి సంబంధించిన వారు చాలా సైలెంట్ గా ఉంటున్నారు. పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకి సంబంధించిన టాప్ హీరోలు రాజమౌళి సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఆ విధంగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన షారుఖ్ ఖాన్ తాజాగా రాజమౌళి కి ఫోన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాహుబలి2 ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలబడింది. రేపటితో ఈ చిత్రం 1500 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను టచ్ చేయనుంది. ఇంతటి సక్సెస్ సాధించిన ఫిల్మ్ డైరక్టర్ తో షారుఖ్ సినిమా చేస్తే…కచ్ఛితంగా అది సక్సెస్ అవుతుందనేది షారుఖ్ అభిప్రాయం.

అలాగే షారుఖ్ ఖాన్ కి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది…అలాగే రాజమౌళికి సౌత్ మార్కెట్ మంచి పట్టు ఉండటంతో వీరిద్దరూ కలిస్తే ఇండియన్ బాక్సాపీస్ కచ్ఛితంగా 2000 కోట్ల రూపాయలను టచ్ చేయటం ఖాయం అనేది షారుఖ్ ఫీలింగ్. అయితే దీనికి రాజమౌళి, షారుఖ్ ఖాన్ కి నో చెప్పినట్టుగా బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

షారుఖ్ ఖాన్ వంటి బాక్సాపీస్ కింగ్ వచ్చి డేట్స్ ఇస్తాను అని చెప్పినప్పటికీ…డైరెక్టర్ రాజమౌళి ఈ విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకొని నో చెప్పటంతో షారుఖ్ కి సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఏం ఆలోచిస్తున్నారో అస్సలు అర్ధం కావటం లేదుట. ఏదైనా ఇక రాబోయో తరం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీదే అని స్పష్టంగా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: