బాహుబలి2 మూవీ ఘన విజయంతో ప్రభాస్ పేరు ఒక్కసారిగా మారుమోగుతుంది. ఒక్క ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ మార్కెట్ లోనూ ప్రభాస్ కి మంచి పేరు ఏర్పడింది. ఇటువంటి సమయంలో ప్రభాస్ మరో హిట్ ని కైవసం చేసుకున్నాడంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నెంబర్ వన్ ప్లేస్ కి చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.


తనతో నేషనల్ ఫిల్మ్స్ ని తెరకెక్కించటానికి బాలీవుడ్ కి చెందిన ప్రముఖ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ సైతం రెడీ గా ఉన్నారు. ఇంతటి అవకాశాన్ని పొందాలంటే ఇప్పుడు ప్రభాస్ తెరకెక్కిస్తున్న మూవీ సాహో కచ్ఛితంగా విజయాన్ని పొందాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాహుబలి2 మూవీతో ప్రభాస్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ దృష్టిలో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ అంతా ప్రభాస్ ని కలవరిస్తున్నారు.


ప్రభాస్ మూవీలో హీరోయిన్ గా నటించాలని తెగ ఆసక్తి చూపుతున్నారు.  బాలీవుడ్ కి చెందిన టాప్ హీరోయిన్స్ ఈ లిస్ట్ లో ఉండటం ఎంతో విశేషంగా మారింది. కత్రినాకైఫ్ వంటి టాప్ హీరోయిన్ నుండి యూత్ హీరోయిన్స్ అలియా భట్, శ్రద్ధా కపూర్, దిశపటాని వరకూ అందరూ ప్రభాస్ సరసన నటించేందుకు చూస్తున్నారు. ప్రభాస్ కు ఈ హీరోయిన్స్ ముంబాయ్ లో జరిగే సెలబ్రిటీ ఈవింగ్ పార్టీలకి ఆహ్వానం పంపుతున్నారు.


ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒక్కసారైనా పార్టీలో పార్టిసిపెట్ చేయాలని బిటౌన్ హీరోయిన్స్ తెగ ఒత్తిడి చేస్తున్నారు. అయితే ప్రభాస్ చాలా రోజుల నుండి బాలీవుడ్ హీరోయిన్స్ కి చిక్కుండా ఏదొక విధంగా తప్పించుకు తిరుగుతున్నారట. దీంతో బాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కసారిగా ప్రభాస్ పై ఘూటు కామెంట్స్ చేశారు. “ప్రభాస్ కి బాలీవుడ్ పార్టీలు అంటే భయం…తనకి అంత సీన్ లేదని, ఈ కల్చర్ ని తట్టుకోవటం సౌత్ హీరోకి కాస్త కష్టమే”అంటూ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: