బాలీవుడ్ కండ‌ల‌వీరుడి  ఫోక‌స్ అంతా ఎప్పుడు  టాలీవుడ్ సినిమాల చుట్టూనే తిరుగుతూ వుంది. హీరో ఎవ‌రైనా సినిమా బిగ్ హిట్టైందా..వెంట‌నే రీమేక్ రైట్స్ కొనేస్తున్నాడు సల్మాన్. ప్రజెంట్ మెంట‌ల్ సినిమా కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన స‌ల్లూబాయ్ ప‌నిలో ప‌నిగా మ‌రో టాలీవుడ్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నాడు.

ప్రిన్స్ న‌టించిన బిజినెస్ మేన్ ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పన‌క్కర్లేదు. ప్రిన్స్ చేత బూతులు కూడా చెప్పించిన పూరి ఎలాగైతేం త‌న స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో సినిమాను హిట్ చేశాడు. క‌ధ‌లో, హీరో క్యార‌క్టరైజేష‌న్ లో ఫుల్ ఫోర్స్ వుండ‌టంతో రామ్ గోపాల్ వ‌ర్మ ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తానంటూ ప్రక‌టించారు కూడా . కానీ అది ఎందుకో వ‌ర్క్ ఔట్ అవ్వలేదు. అయితే ఇపుడు బిజినెస్ మేన్ రీమేక్ రైట్స్ స‌ల్మాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ ద‌క్కించుకున్నాడు. ఆర్.ఆర్.మూవీ మేక‌ర్స్ వారికి పెద్ద మొత్తమే చెల్లించి మ‌రీ రైట్స్ తీసుకున్నట్టు స‌మాచారం. .
��
ప్రజెంట్ మెంట‌ల్ , ఆ త‌రువాత ప్రభుదేవా, సూర‌జ్ డైరెక్షన్ లో సినిమాలు చేసేందుకు స‌ల్మాన్  సైన్ చేశారు. ఆ రెండు సినిమాల త‌రువాత బిజినెస్ మేన్ రీమేక్  సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం వుంది.  అంతేకాదు ఈ సినిమాను స‌ల్మాన్ సొద‌రుడే అర్భాజ్ ఖాన్ డైరెక్ట్ చేస్తాడ‌ని బి టౌన్ క‌బ‌ర్. మ‌రి బిజినెస్ బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గర ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: