ప్రపంచంలో సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన చిత్రం జెమ్స్ బాండ్ సిరీస్.  ఒక నవల ఆధారంగా తెరకెక్కిన జెమ్స్ బాండ్ చిత్రాలు ఇప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.  ఈ చిత్రాల్లో నటించిన హీరోలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు.    ‘జేమ్స్ బాండ్’ హీరో సర్ రోజర్ మూర్ (89) మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ద్వారా తెలిపారు.  
Image result for sir roger moore
గత కొంత కాలంగా ఆయన కేన్సర్ వ్యాదితో బాధపడుతున్నారని.. తమ తండ్రి ఈ రోజు మృతి చెందారని, బరువెక్కిన హృదయాలతో ఈ బాధాకరమైన వార్తను తెలియజేస్తున్నామని  ట్విట్టర్ ఖాతా ద్వారా రోజర్ మూర్ పిల్లలు తెలిపారు. సర్ రోజర్ మూర్ తన అద్భుతమైన నటనతో ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారని పలువురు సెలబ్రెటీలు తమ ట్విట్టర్ లో ట్విట్ చేస్తున్నారు.  
Image result for sir roger moore
స్విట్జర్లాండ్ లో మృతి చెందిన రోజర్ మూర్ అంత్యక్రియలు మొనాకోలో నిర్వహించనున్నారు. కాగా, ‘స్పై’ పాత్రలో రోజర్ మూర్ నటించారు. ‘లివ్ అండ్ లెట్ డై’, ‘స్పై హూ లవ్డ్ మీ’, ‘ఆక్టోపసీ’, ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’, ‘ఏ వ్యూ టూ ఏ కిల్’ సినిమాల్లో రోజర్ మూర్ ‘జేమ్స్ బాండ్’ పాత్రలు పోషించారు. ‘ది లాస్ట్ టైమ్ ఐ సా ప్యారిస్’, ‘ఇంటరప్టెడ్ మెలోడీ’, ‘ది కింగ్స్ థీఫ్’, ‘ది మిరాకిల్’ తదితర చిత్రాల్లో రోజర్ మూర్ నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: