ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతుంది.  అయితే చాలా వరకు స్టార్ హీరోల, హీరోయిన్ల వారసులు నటులుగా తమ సత్తాను చాటుతున్నారు.  అంతే కాదు దర్శక, నిర్మాతల వారసులు కూడా సినిమా హీరో గానే ఎంట్రీ ఇస్తున్నారు.  ఈ నేపథ్యం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూతురు కూడా సినీ రంగ ప్రవేశం చేస్తుంది. ఇప్పటికే ఆయన తనయుడు బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆకాష్ ఓ సినిమాలో హీరో గా కూడా నటించాడు.  కాకపోతే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో మనోడు నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందీ అంటూ కాస్త గ్యాప్ ఇస్తున్నాడు.  
Image result for puri jagannadh balakrishna
అయితే ఇప్పుడు పూరి కూతురు సినీ రంగ ప్రవేశం చేస్తుందీ అనగానే హీరోయిన్ అవుతుందేమో అని అనుకున్నారు.  కానీ దీనికి భిన్నంగా పూరి కూతరు పవిత్ర డైరెక్షన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.  వాస్తవానికి ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ చిత్రంలో పవిత్ర, ఆకాష్ లు చిన్న నాటి పాత్రలు వేశారు.  అయితే ఆ తర్వాత పవిత్ర చదువులతో బిజీ గా ఉండి సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు కట్ చేస్తే ఇప్పుడేమో బాలయ్య నటిస్తున్న చిత్రాన్ని దగ్గరగా చూస్తూ అవగాహన పెంచుకుంటోంది.  
Image result for akash pavitra
ఏది ఏమైనా హీరో కొడుకు హీరోగా, హీరోయిన్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ సమయంలో పూరి కూతురు డైరెక్షన్ వైపు మొగ్గు చూపడం యాధృచ్చికమే అయినా భవిష్యత్ లో హీరోయిన్ ఎంట్రీ ఇస్తానంటే పూరి ఒప్పుకుంటాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. మేకింగ్ లో పార్ట్ అయితే మిగతా విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తోందట . టీనేజ్ లో ఉన్న పవిత్ర కు సినిమాలంటే మాత్రం చాలా చాలా ఇష్టం మరి . 


మరింత సమాచారం తెలుసుకోండి: