తాజాగా అక్కినేని యువ హీరో నాగచైతన్య నటించిన మూవీ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుక జరిగింది. అయితే ఈ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావ్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్ఛగా మారాయి. తెలుగు పరిశ్రమలో ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. గతంలో మహిళలపై ఈ విధంగా కామెంట్ చేసిన పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లపై ఇదే స్థాయిలో మహిళా సంఘాలు వారికి బుద్ది చెప్పాయి.

అయితే ఇప్పుడు ఆ తీవ్రత కాస్త ఎక్కువుగా ఉంది. సీనియర్ నటుడు అయిన చలపతి రావ్ కి ఇండస్ట్రీలో అంత బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకపోవటంతో ప్రతి ఒక్కరూ తనపై విరుచుకుపడ్డారు. దీంతో ఇండస్ట్రీ పెద్దలు సైతం చలపతి రావు వైపు పాజిటివ్ గా మాట్లాడలేదు. ఒక్క చలపతిరావు కామెంట్స్ కారణంగా ఎంత మంది ఇరుకున పడ్డారో ఇది చూస్తే తెలిస్తుంది.

చలపతిరావు కామెంట్స్ కి యాంకర్ రవి  సూపర్ అనటంతో ఇప్పడు వీరిద్దరి మధ్య మాటలు లేవు. అలాగే ప్రస్తుతం యాంకర్ రవి కాంట్రవర్సియల్ గామారటంతో కొన్ని ఆడియో ఫంక్షన్స్ ని మిస్ చేసుకోవల్సి వస్తుందని అంటున్నారు. అలాగే చలపతిరావ్ మాట్లాడగానే నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లు వెంటనే బిగ్గరగా నవ్వినట్టు ఉంది. అయితే వీడియోలో చూపినట్టు తాము ఆయన మాటలకు నవ్వలేదని వీరు క్లారిటీ ఇచ్చుకొని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని తెలిపారు.

దీని కారణంగా చలపతి రావుని తన మూవీలో అస్సలు తీసుకోకూడదని  నాగచైతన్య నిర్ణయించుకున్నారు. ఇక అక్కినేని నాగార్జున సైతం చలపతిరావుపై ఘాటూ వాఖ్యలు చేశారు. దీనికి ధీటుగా చలపతిరావు సైతం అదే స్థాయిలో వాఖ్యలు చేయటంతో ఇప్పడు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని అంటున్నారు. అయితే పబ్లిక్ కామెంట్స్ కారణంగా ఇండస్ట్రీలోని వ్యక్తులు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవటంతో చాలా సీక్రెట్స్ బయటకు వస్తున్నాయి. ఇది ఎంత దూరం వెళుతుందో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: