తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు డైరెక్టర్ వంశి.  తన సినిమాల్లో డ్యాన్స్, మ్యూజిక్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా కామెడీ ని అద్భుతంగా పండిస్తారు.  గత కొంత కాలంగా వంశి దర్శకత్వంలో సినిమాల చాలా తక్కువగా వచ్చాయి. వంశీ చాలాకాలం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం '' ఫ్యాషన్ డిజైనర్ ''. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.  అయితే ఈ సినిమా కు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారట సెన్సార్ సభ్యులు. దీంతో అదేంటీ కుటుంబ నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించే వంశి తీసిని సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం ఏంటి ? అని ఆశ్చర్య పోతున్నారు.  
Image result for fashion designer new stills
గతంలో కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ నటించిన లేడీస్ టైలర్ చిత్రం సీక్వెల్ అని ఆ మద్య తెగ చర్చించుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యాషన్ డిజైనర్ పేరుతో బూతు చొప్పించారట.  ఈ మద్య సినిమాల్లో డబల్ మీనింగ్స్ తో చాలా వరకు వ్యంగంగా రూపొందిన చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
Image result for fashion designer new stills
ఈ నేపథ్యంలో  '' ఫ్యాషన్ డిజైనర్ '’ చిత్రంలో కూడా  బూతు జోకులు , హీరోయిన్ ల అందాలు అతిగా చూపించే సన్నివేశాలు ఉండటం తో ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే అని అన్నారట . ఏ సర్టిఫికేట్ ఉండటం వల్ల బిసి కేంద్రాల్లో మంచి వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు. మరి లేడీస్ టైలర్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ఎంత వరకు హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: