తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి..ఎంతో మంది దర్శకులను ప్రేరణగా నిలిచి..వారిని ఇండస్ట్రీలో టాప్ దర్శకులుగా మలిచిని గొప్ప దర్శకులు దాసరి నారాయణ రావు.  గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన నిన్న రాత్రి కీమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు.  ఈ విషయం తెలుసుకున్న యావత్ తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారే దుఖఃసాగరంలో మునిగిపోయింది.  ఎంతో మంది సినీ ప్రముఖులు వెంటనే ఆయన ఇంటికి చేరుకొని కడసారి కన్నీటి వీడ్కోలు తెలిపారు.  

Exclusive: Dasari Narayana Rao Dead Body Photos

 ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో  విభిన్న‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి 151 చిత్రాల‌కు ద‌ర్శ‌కుడిగా త‌న పేరును సువ‌ర్ణాక్ష‌రాల‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో రాసుకున్న ద‌ర్శ‌కర‌త్న డా.దాస‌రినారాయ‌ణరావుగారు ప‌ర‌మ‌ప‌దించ‌డం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధ‌కు గురి చేసింది. ఇండ‌స్ట్రీకి సంబంధించి ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేనున్నా అంటూ ముందుకు వ‌చ్చి నిల‌బ‌డి న్యాయం చేకూర్చే గొప్ప వ్య‌క్తి దాస‌రిగారు. మంచి చిత్రాల‌కు ఆద‌ర‌ణ ఉండాల‌ని, చిన్న నిర్మాత‌లు బావుండాల‌ని కోరుకునే శ్రేయోభిలాషి ఆయ‌న‌. మా ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌కు వెన్నంటి నిలిచారు.
Exclusive: Dasari Narayana Rao Dead Body Photos
ఎంట‌ర్‌టైన్మెంట్‌ను ఇష్ట‌ప‌డే దాస‌రిగారు మా సంస్థ‌లో వ‌చ్చిన ప్ర‌తి సినిమాను ఆయ‌న వీక్షించి యూనిట్‌కు త‌న ఆశీస్సుల‌ను అంద‌చేసేవారు. . భౌతికంగా దాస‌రిగారు మ‌న‌ల్ని విడిచి పెట్టినా, ఆయ‌న సినిమాల రూపంలో ఎప్ప‌టికీ మ‌న మ‌ధ్య‌నే ఉంటారు. మా సంస్థ‌కు దాస‌రిగారు అందించిన  అందించిన స‌హాయ స‌హ‌కారాల‌ను మ‌ర‌చిపోలేం. మా బ్యాన‌ర్‌లో విడుద‌ల‌వుతున్న `అంధ‌గాడు` చిత్రాన్ని దాస‌రిగారికి అంకిత‌మిస్తున్నాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాం.
  - ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్

మరింత సమాచారం తెలుసుకోండి: