స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే టాలీవుడ్ లో సూపర్ క్రేజ్.. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు డ్యాన్స్ ను ఇష్టపడే వారంతా బన్ని డ్యాన్స్ కు ఫ్యాన్స్ అవుతుంటారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. సాంపిల్ గా వదిలిన గుడిలో మడిలో సాంగ్ డ్యాన్స్ స్టెప్పులతో కేక పెట్టించేశాడు అల్లు అర్జున్.


టాలీవుడ్ డ్యాన్సింగ్ స్టార్స్ లో ముందు వరుసలో ఉండే అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేయాలంటే మాత్రం సహనటులు తెగ ఇబ్బంది పడుతుంటారు. ఆ వరుసలో డిజె హీరోయిన్ పూజా హెగ్దె కూడా బన్నితో డ్యాన్స్ అంటే బాబోయ్ చాలా కష్టం అనేస్తుంది. గుడిలో సాంగ్ లో బన్నితో పాటు పూజా పర్వాలేదు అనిపించినా బన్నితో డ్యాన్స్ చేయాలంటే అంతకంటే కష్టమైన పని ఇంకోటి ఉండదు అంటుంది పూజా.


సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన క్షణం నుండి సినిమా మీద చాలా ఎక్సయిటింగ్ గా ఉంది పూజా హెగ్దె. తనకు ఈ సినిమా తప్పకుండా ఓ మంచి హిట్ ఇస్తుందని నమ్ముతుంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న డిజె జూన్ 23న రిలీజ్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సినిమాలో క్లైమాక్స్ సాంగ్ ఒక్కటి షూటింగ్ చేయాల్సి ఉందట.


ఆ సాంగ్ కోసం బన్నితో పాటు పోటీగా చేసేందుకు రిహార్సెల్స్ చేస్తుందట పూజా హెగ్దె. బాలీవుడ్ డ్యాన్సింగ్ స్టార్ హృతిక్ తో నటించినా అమ్మడు బన్ని డ్యాన్స్ కు ఫిదా అయ్యిందంటే స్టైలిష్ స్టార్ డ్యాన్సింగ్ పవర్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సినిమాలో అమ్మడు హాట్ గా కనిపించబోతుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: