క్రేజీ నిర్మాతగా దిల్ రాజుకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. హీరోలు దర్శకుల పేర్లు చూసి సినిమాలకు వెళ్లినట్టుగా దిల్ రాజు బ్యానర్ చూసి కచ్చితంగా ఇదో మంచి సినిమా అన్న భావనతో యూత్ ఎగబడుతుంటారు. ఈ క్రమంలో నిర్మాతగా సక్సెస్ అవడంతో పాటు ముందునుండి చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ లో కూడా దిల్ రాజు అగ్రస్థానంలో చేరాడు.


తన ప్రొడక్షన్ లో నిర్మితమవుతున్న సినిమాల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యే దిల్ రాజు కథ దగ్గర నుండి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే ఒకానొక సందర్భంలో తనకు డైరక్షన్ చేయాలని ఉంది అన్న మనసులో మాటని బయట పెట్టాడు దిల్ రాజు. సినిమాల అనుభవంతో దిల్ రాజు డైరక్షన్ చేసినా చేసేయొచ్చని భావించారు.


అయితే ఆ తలనొప్పి నాకొద్దు బాబోయ్ అని ఇప్పుడు మళ్లీ మాట మార్చాడు రాజు గారు. రీసెంట్ గా జరిగిన డిజె ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మైక్ అందుకున్న రాజు సినిమా మీద ఫుల్ కాన్ ఫిడెన్స్ గా ఉన్నట్టు చెప్పారు. ఇక దర్శకత్వ భాధ్యత మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త దర్శకుల కష్టాలు చూసి దూరమయ్యిందని ఇక తాను మెగా ఫోన్ పట్టే అవకాశాలు లేవని అన్నారు దిల్ రాజు.


తన దగ్గర పని చేసిన దర్శకుల కష్టాలు చూడటమే కాదు వారి సలహ మేరకే తాను డైరక్షన్ చేయాలనే ఆలోచనని వెనక్కి తీసుకున్నట్టు చెప్పారు దిల్ రాజు. మొత్తానికి తన దగ్గర పనిచేసిన దర్శకులే దిల్ రాజు కు డైరక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ను దూరం చేసి విసుగు వచ్చేలా చేశారని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: