‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తో నటించాలని చాలామంది హీరోయిన్స్ కలలుకంటుంటే ప్రభాస్ తో ‘సాహో’ లో నటించే అవకాశం వచ్చి కూడ ఆ అవకాశాన్ని జారవిడుచుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న ఒక కన్నడ హీరోయిన్ కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ పేరు రష్మిక. 

గత సంవత్సరం కన్నడంలో సంచలన విజయం సాధించిన ‘కిరిక్ పార్టీ’ లో నటించి పాపులర్ అయిన రష్మిక కన్నడ సినిమా రంగంలో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టిని ఈమె ప్రస్తుతం త్వరలో వివాహం చేసుకోబోతోంది. 

‘కిరిక్ పార్టీ’ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడటంతో ఇప్పుడు ఆ ప్రేమ పెళ్ళిగా మారుతోంది. రష్మిక పెళ్లి చేసుకోబోతున్న రక్షిత్ శెట్టి యంగ్ హీరోగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు కూడ దర్శకత్వం వహించాడు. తాను పెళ్లి చేసుకోబోతున్న రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా తాను రక్షిత్ ను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని బయట పెట్టింది రష్మిక.

హాపీ బర్త్ డే మై డియర్ నా జీవితంలో నేను కలిసిన మంచి ముత్యం లాంటి మనిషివి నీవు. నిన్ను కలుసుకోవడం నీతో జీవితం పంచుకోవడం నాకు నా కుటంబానికి చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టు మై బుజ్జి ఫ్యామిలి'' అని పోస్ట్ చేసింది రష్మిక. దీనితో ఇప్పటి వరకు రష్మిక రోహిత్ శెట్టిల పై వస్తున్న రూమర్లకు శుభం కార్డుపడి ఆ రూమర్లు పెళ్ళిగా త్వరలో మారబోతోంది అనుకోవాలి. 

అయితే ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ లో పిలిచి హీరోయిన్ అవకాశం ఇచ్చినా దానిని లెక్క చేయకుండా పెళ్ళి కూతురుగా మారుతున్న రష్మిక వ్యవహార శైలి ఒక విధంగా సంచలనమే అనుకోవాలి. ప్రస్తుతం ఈమె నాగశౌర్య రామ్ లు నటిస్తున్న రెండు సినిమాలలో హీరోయిన్ గా చేస్తోంది. ఈసినిమాలు పూర్తి అవగానే రష్మిక కు పెళ్ళి భాజాలు మ్రోగడం ఖాయం..      


మరింత సమాచారం తెలుసుకోండి: