భారత దేశంలోనే కాదు చైనాలో ప్రభంజనం సృష్టించిన చిత్రం ‘దంగల్’.  అమిర్ ఖాన్ నటించి నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు రివార్డులు గెల్చుకుంది.  వివమర్శకుల చే ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం రియల్ స్టోరీ కావడం మరో విశేషం.  ఈ చిత్రం చూసి ఇందులో  గీతా ఫొగట్ గా నటించిన ఫాతిమా సనా షేక్ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.  అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త పేరు ప్రఖ్యాతలు వస్తే తాము గొప్ప సెలబ్రెటీలు అని ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు.  
Image result for dangal actress fatima hot swimsuit
తాజాగా ఈ జాబితాలోకి వస్తుంది..ఫాతిమా సనా షేక్ .  ఈ అమ్మడు  మాల్దీవుల్లో సముద్రపు తీరంలో... స్మిమ్ సూట్లో దిగిన కొన్న ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇదే ఈ అమ్మడిని చిక్కుల్లో పడేసింది. ఈ ఫొటోలను పలువురు నెటిజన్లు లైక్ చేస్తుండగా... మరోవైపు కొందరు మత సంరక్షకులు రంగంలోకి దిగారు.

పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి అసభ్యకరమైన ఫొటోలను పోస్ట్ చేస్తావా అంటూ సనాపై నిప్పులు చెరిగారు.  అంతే కాదు సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరోవైపు మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తనకు నచ్చిన దుస్తులు వేసుకునే హక్కు ఆమెకు ఉందని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: