తెలుగు దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. గ్రహణం షార్ట్ ఫిల్మ్ తో సంచలనం సృష్టించిన మోహనకృష్ణ అష్టా చెమ్మా సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమాతో నానిని హీరోగా ఎంట్రీ ఇప్పించిన మోహనకృష్ణ లాస్ట్ ఇయర్ అదే నానితో జెంటిల్మన్ సినిమా తీసి హిట్ అందుకున్నాడు. 


తీసిన ప్రతి సినిమా ఏదో ఒక నవల నుండి కాపీ కొడుతుంటాడని మోహనకృష్ణ ఇంద్రగంటి మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటి గురించి ఈరోజు రిలీజ్ అవుతున్న అమీ తుమీ ప్రమోషన్స్ లో నోరు విప్పాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తను తీసే ప్రతి సినిమా ఏదో ఒక నవల ఆధారంగా స్పూర్తి పొంది సినిమా తీస్తానని ఒప్పుకున్నాడు మోహనకృష్ణ.


అష్టాచమ్మ కథ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనే నవల ఆధారంగా రాసుకున్నా అని చెప్పిన మోహనకృష్ణ.. గోల్కొండ హైస్కూల్ కూడా ఓ నవల ఆధారంగా తెరకెక్కించినదే. జెంటిల్ మన్ కథను మాత్రం నాధన్ అనే రచయిత అందించాడని చెప్పిన మోహనకృష్ణ రిచార్డ్ షెరిడాన్ అనే ఇంగ్లీష్ డ్రామా ఆధారంగా అమీ తుమీ కథ రాసుకున్నాని అన్నాడు ఇంద్రగంటి మోహకృష్ణ.


ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్ లీడ్ రోల్స్ లో నటించారు. జెంటిల్ మన్ తో పరిశ్రమలో అందరిచేత ప్రశంసలు అందుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ అమీ తుమీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: