హీరో హీరోయిన్ కాస్త చనువుగా ఉంటే చాలు వారి మధ్య ఏదో జరుగుతుందని అంటుంటారు. ఇక వరుసగా హీరో హీరోయిన్ జతకడుతుంటే ఇద్దరి మధ్య సీరియస్ రిలేషన్ షిప్ ఉందని అనుకుంటారు. ఈ క్రమంలో దర్శకుడు ఒక హీరోయిన్ ను తన వెంట వెంట సినిమాల్లో తీసుకుంటే కచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ ఉందని అనుకుంటారు. 


ప్రస్తుతం అలాంటి రూమర్స్ తో షాక్ ఇస్తున్నారు ఈషా ఇంద్రగంటి న్యూస్. ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన రెండు మూడు సినిమాల్లో అమ్మడు హీరోయిన్ గా నటించింది తెలుగు అమ్మాయే కాబట్టి ఆమెను తీసుకుంటే తెలుగుదనం ఉంటుందని ఆమెను సెలెక్ట్ చేస్తున్నా అంటున్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇక మా మధ్య ఎలాంటి పర్సనల్ రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు.


అమీ తుమీలో ఈషా హీరోయిన్ గా నటించింది. ఆంధ్ర అమ్మాయి అయినా సరే తెలంగాణా యాసలో ఈషా బాగా డైలాగ్స్ చెప్పిందని తెలుస్తుంది. ముంబై నుండి హీరోయిన్స్ తెప్పిస్తే వాళ్లకు డైలాగ్స్ నేర్పించడానికే ఎక్కువ టైం పడుతుందని అందుకే తన సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ మాత్రమే ఉంటారని అన్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. 


మరింత సమాచారం తెలుసుకోండి: