2018 సంక్రాంతికి స్టార్ సినిమాల హవా మాములుగా లేదు. ఇప్పటికే కొందరు స్టార్స్ తమ సినిమా 2018 సంక్రాంతి రిలీజ్ అని కన్ఫాం చేయగా మిగతా వాళ్లు కూడా అదే డేట్ ను ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వచ్చే పొంగల్ వార్ లో ఎవరెవరు ఫైట్ చేస్తున్నారు అంటే.. మహేష్.. చరణ్.. బాలకృష్ణ అని తెలుస్తుంది.


ప్రస్తుతం మహేష్ మురుగదాస్ డైరక్షన్ లో స్పైడర్ మూవీ చేస్తుండగా.. ఆ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న భరత్ అను నేను సినిమా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సిఎంగా కనిపించబోతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. మహేష్ సంక్రాంతి సీజన్ అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి చేసుకునట్టే లెక్క.  


ఇక మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఎనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసి చెప్పాడు చరణ్. సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరక్టర్ తో చరణ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా టైటిల్ రంగస్థలం 1985 కూడా అందరిని షాక్ అయ్యేలా చేసింది.


ఇక శాతకర్ణి తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా పైసా వసూల్. పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలైతే సెప్టెంబర్ 29న రిలీజ్ అంటూ పూరి ఎనౌన్స్ చేసినా రెండేళ్లుగా తన సినిమాలను పొంగల్ వార్ లో దించి సక్సెస్ అందుకున్న బాలయ్య అదే సక్సెస్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.


మరి ఈ మెగా ఫైట్ లో ఎవరు విజయ పతాకం ఎగురవేస్తారో చూడాలి. సంక్రాంతి పండుగ అంటేనే సినిమా పండుగ కొత్త సంవత్సరంలో కొత్త సినిమాలతో ప్రేక్షకుల్లో నూతనోత్సాహన్ని నింపే ఈ పండుగ ఏ సినిమా వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: