సినీ తార‌ల జీవితాలు ఇలాగే ఉంటాయ్‌. పైపైకే ఆ మెరుపులు. లోప‌లంతా క‌ష్టాల క‌డ‌లే! ప‌వ‌న్ క‌ల్యాణ్‌కీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయ‌ని తెలిసి ప‌ప‌న్ ఫ్యాన్స్ షాక్‌కి గుర‌య్యారు. మా హీరో ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డం ఏమిటి?? అని ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌వ‌న్ త‌న ఫ్లాట్ అమ్ముకొన్నాడంటే క‌నీసం న‌మ్మ‌లేదు. కానీ అవ‌న్నీ నిజాలే న‌ట‌..


ప‌వన్ తో జీవితానికి గుడ్‌బై చెప్పి... రేణూ దేశాయ్ వెళ్లి పోయింది. వెళ్తూ వెళ్తూ ప‌వ‌న్ నుంచి రూ40 కోట్లు భ‌ర‌ణంగా ప‌ట్టుకెళ్లిపోయింద‌ట‌. ఆ సొమ్ము స‌ర్ద‌డానికి ప‌వ‌న్ నానా పాట్లూ ప‌డ్డాడ‌ట‌. అందుకే త‌న ఫామ్ హౌస్ బేరం పెట్టాడ‌ట‌. ప‌వ‌న్ తన ఖాళీ స‌మయాన్నంతా అక్క‌డే గ‌డుపుతాడు. కూర‌గాయ‌లు పండిస్తాడు. త‌న ప‌నులు తాను చేసుకొంటాడు. ప‌వ‌న్‌కి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అయినా స‌రే - డ‌బ్బుల కోసం మ‌రో మార్గం లేద‌ట‌.


గ‌బ్బ‌ర్ సింగ్ 2 సినిమా కూడా డ‌బ్బుల కోస‌మే ఒప్పుకొన్నాడ‌ట‌. అడిగిన వారికి లేద‌న‌కుండా దాన ధ‌ర్మాలు చేయ‌డం వ‌ల్లే ప‌వ‌న్ ఈ స్థితికి వ‌చ్చాడ‌ని అభిమానులు బాధ‌ప‌డుతున్నార‌ట.

మరింత సమాచారం తెలుసుకోండి: