సినిమా ఇండస్ట్రీ అనగానే అదో రంగుల ప్రపంచం అనుకుంటారు..ఇక్కడ ఒక్క చాన్స్ దొరికితే చాలు  ప్రపంచంలో తనకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ లేరని భావిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే జరుగుతుంది..ఒక్కసారి సెలబ్రెటీ అయిన వారికి జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో కొన్ని చీకటి కోణాలు కూడా ఉంటాయి..రంగుల ప్రపంచం అనుకున్న వారు కన్నీటి కష్టాల్లో మునిగిపోయి చనిపోయిన వారు ఉన్నారు. అంతే కాదు ఈ మద్య నటీమణులకు రక్షణ కరువైంది.  
Image result for actress-kritika-choudhary
నటీమణులపై కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటి కృతికా చౌదరి (30) ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది.  ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఇరుగు, పొరుగు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు కృతిక మరణించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.
Image result for actress-kritika-choudhary
అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని చార్ బంగ్లా ప్రాంతంలో ఉన్న భైరవ్ నాథ్ సొసైటీలో ఆమె నివాసం ఉంటున్నారు. కృతిక మూడురోజుల కిందటే హత్యకు గురైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  కృతిక మృతిపట్ల పలు అనుమానాలున్నాయని.. ఆమె ఇంటి గదికి వెలుపల గడివేసి వుండటం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెప్తున్నారు.    
Image result for actress-kritika-choudhary
హరిద్వార్ నుంచి ముంబైకి వచ్చిన కృతికా చౌదరి.. కంగనా రనౌత్ రజో లో నటించింది. ప్రస్తుతం కొన్ని టివి షోలోలు చేస్తుంది. అయితే ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయాలు ఇంకా తేల్చలేదు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

Image result for actress-kritika-choudhary


మరింత సమాచారం తెలుసుకోండి: