ఈ వార్త వింటే నిజంగా కాజల్ ఏంటీ ఇంకా పెళ్లి కాలేదు..అప్పుడే ప్రెగ్నెన్సా అన్న అనుమానాలు వస్తున్నాయా..  అవునండీ మీరు విన్నది నిజమే!.. టాలీవుడ్ చందమామ కాజల్ గర్భవతిగా ఆసుపత్రికి వెళ్లింది...ఆ..ఇది నిజంగా రియల్ లైఫ్ లో కాదండీ బాబూ..రీల్ లైఫ్ లో..  కాజల్ ని టాలీవుడ్‌కు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతోంది.  

సినీ హీరో రానా, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మంగళవారం బనగానపల్లె ఆసుపత్రికి చేరుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్‌ను అక్కడ నిర్వహించారు.  గర్భిణిగా కాజల్‌ ఆసుపత్రికి రాగా, స్కానింగ్‌ చేసే సన్నివేశాలను షూటింగ్‌ చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌ గదికి వెళ్లే ప్రధాన గేట్‌కు తాళం వేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు.  
Related image
అయితే అక్కడ ఏం జరుగుతుందో మొదట ఎవ్వరికీ అర్థం కాకపోయినా తర్వాత షూటింగ్ అని తెలిసిన తర్వాత జనాల తాకిడి బాగా పెరిగిపోయింది.  ఈ సందర్భంగా దర్శకులు తేజ మాట్లాడుతూ..ఈ సినిమాను తెలుగు, తమిళం, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  ఈ చిత్రం షూటింగ్‌లో దర్శకుడు తేజ, నిర్మాత దగ్గుబాటి అభిరామ్, డ్యాన్స్ మాస్టర్ శంకర్, కెమెరామెన్ వెంకట్ సి, దిలీప్ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: