నాచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటిస్తున్న సినిమా నిన్ను కోరి. డివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఆల్రెడీ సిని ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కొద్ది నిమిషాల క్రితమే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 


తననే ప్రేమించా.. తననే పెళ్లిచేసుకోవాలనుకున్నా.. చావైనా బ్రతుకైనా తనతోనే అనుకున్నా అంటూ నాని చెప్పిన డైలాగ్ ఒక్కటి చాలు సినిమాలో నాని ఎలాంటి ఎమోషన్ సీన్స్ పండించాడో తెలియడానికి. ఇక ఫైనల్ గా నా గెలుపు ఆల్రెడీ మొదలైంది అని నాని చెప్పడం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నాని ఈసారి కూడా హిట్ ఫిక్స్ అన్నట్టే ఉంది.


ట్రైలర్ లో నాని, నివేదా, ఆది ముగ్గురే కనిపించడం విశేషం.. సినిమా కూడా ఈ ముగ్గురి మధ్యే నడుస్తుందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. సరైనోడు తర్వాత ఆది పినిశెట్టి నటిస్తున్న తెలుగు సినిమాగా నిన్ను కోరి సూపర్ క్రేజ్ సంపాదించింది. జూలై 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నాని హిట్ మేనియాని కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: