చేతి రేఖలను బట్టి హస్త సాముద్రికాలు చెప్పేవారు ఎందరో మనదేశంలో ఉన్నారు. పెద్దపెద్ద స్థాయిలలో ఉన్నవారు దగ్గరనుంచి బాగా చదువుకున్న మేధావులుకూడ ఈహస్త సాముద్రిక విషయాలకు బుట్టలో పడిపోతారు. ‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ చేయబోతున్న ‘సాహో’ లోని ప్రభాస్ పాత్ర పై ఇప్పటికే క్లారిటీ వచ్చినా ప్రభాస్ చేతి రేఖలకు సంబంధించిన హస్త సాముద్రిక మాయలో హడావిడి చేసే పాత్రలో నటించబోతున్నాడు అని వార్తలు రావడం ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ‘సాహో’ సినిమా షూటింగ్ ఒక దశకు వచ్చాక ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు గోపీ కృష్ణా మూవీస్ ప్రొడక్షన్ హౌస్ లో మరో సినిమాను వచ్చే సంవత్సరం మొదలు నుండి మొదలు పెట్టడానికి లైన్ క్లియర్ చేసిన విషయం తెలిసిందే. ‘జిల్’ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ ఈమూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. 

అయితే రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈసినిమా ఒక హాస్య సినిమాగా ఉంటుందని టాక్. ఈసినిమాలో ప్రభాస్ హస్త సాముద్రికం చెప్పే సిద్ధ హస్తుడిగా కనిపిస్తాడని అంటున్నారు. హస్త సాముద్రికం చుట్టూ తిరిగే ఈకథలో హాస్యంతో పాటు ఒక క్రైమ్ స్టోరీ కూడ ముడిపడే విధంగా దర్శకుడు రాధాకృష్ణ ఈసినిమా కథను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటి వరకు రెబల్ స్టార్ గా కనిపించిన ప్రభాస్ చేత కామెడీ చేయించడం ఒక ప్రయోగం అయినా ఆ ప్రయోగం వల్ల ప్రభాస్ ఇమేజ్ దెబ్బ తింటుందా అన్న భయాలు కూడ ప్రభాస్ సన్నిహితులు వ్యక్త పరుస్తున్నట్లు టాక్. ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ చేయబోయే ప్రయోగాలలో ప్రభాస్ చిక్కుకోవడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: