హీరో గోపీచంద్ హీరోగా నటించే సినిమాలకు క్రేజ్ తగ్గిపోయి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఈ హీరో ‘లౌక్యం’ తో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు అని అందరూ భావించిన కొద్ది కాలానికే గోపీచంద్ హీరోగా నటించిన సినిమాలు వరస పరాజయాలు చెందాయి. ‘సౌక్యం’ భారీ ఫెయిల్యూర్ ను అందిస్తే ఆ తరువాత వచ్చిన ‘ఆక్సిజన్’ అడ్రెస్ లేకుండా పోయి విడుదల కావలసి ఉన్న ‘ఆరడుగుల బుల్లెట్’ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని అయోమయ స్థితిలో చిక్కుకుంది. 

ఇలాంటి వ్యతిరేక పరిస్థుతులలో గోపీచంద్ నటించిన గౌతమ్ నంద 30 కోట్ల బిజినెస్ చేసినట్లు వార్తలు రావడం ప్రస్తుతం టాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమాలో గోపీచంద్ రెండు షేడ్స్ తో ఉండే ఒక డిఫరెంట్ రోల్ ను పోషించినట్లు వార్తలు వస్తున్నాయి. రమణ మహర్షి పుస్తకాలలోని ‘హూ యామ్ ఐ’ సూక్తుల నుంచి దర్శకుడు సంపత్ నంది స్ఫూర్తి పొంది ఈకథను రచించాడని తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాలో గోపీచంద్ ఒక కోటీశ్వరుడు సంపద హోదా వీటన్నింటి పై విరక్తి కలిగి ఒక సామాన్యుడులా కొన్ని అనుకోని పరిస్థుతుల వల్ల జనం మధ్య బ్రతక వలసి వస్తుంది. ఒక విధంగా ఈసినిమా కొన్ని చోట్ల ‘బిచ్చగాడు’ సినిమాను పోలి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు అక్కడక్కడా పవన్  ‘అత్తారింటికి దారేది’ ఛాయలు ఈసినిమాలో కనిపిస్తాయి అన్న ప్రచారం కూడ ఉంది.

అయితే ఇలాంటి ఒక కాపీ కథతో దర్శకుడు సంపత్ నంది చేసిన ప్రయోగానికి సంబంధించిన సినిమాను దిల్ రాజ్ 6 కోట్లు పెట్టి నైజాం ప్రాంతానికి కొనుక్కున్నట్లుగా వార్తలు రావడంతో ఆ వార్తలను ఆసరాగా తీసుకుని ఈ సినిమాలో ఎదో ఉంది అన్న అభిప్రాయంతో ఈసినిమాకు 30 కోట్ల బిజినెస్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈసినిమా కోసం గోపీచంద్ ఏర్పరుచుకున్న డిఫరెంట్ లుక్ కూడ ఈసినిమా బిజినెస్ కు కలిసి వచ్చింది అంటున్నారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్న గోపీచంద్ గౌతమ్ నంద పాత్ర ఈసినిమాకు కోట్లు తెచ్చి పెడుతుంది అని ఆశిస్తున్న బయ్యర్ల ఊహలు ఎంత వరకు నిజం అవుతాయో త్వరలో తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: