పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా తిరుగులేని అభిమాన గళాన్ని ఏర్పరచుకున్న స్టార్ హీరో.. సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దిమంది హీరోల్లో ఒకరని చెప్పొచ్చు. సినిమాల్లో నాయకుడిగా నడిపించడమే కాదు రియల్ లైఫ్ లో కూడా నాయకుడవ్వాలనే ఆలోచన ఆశయంతో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టి రంగంలో దిగుతున్నారు.  


పవన్ మీటింగ్ అంటే అక్కడ జన సంద్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే ఇసుకేస్తే రాలనంత జనం మీటింగ్ ఏర్పాటు చేసిన గ్రౌండ్ మొత్తం ఫుల్ ప్యాక్ అవడం గమనిస్తూనే ఉంటాం. పార్టీ పెట్టిన నాటి నుండి పవన్ కు ఇంకాస్త ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడింది. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలో దిగుతున్న జనసేనాని ఎన్నికల్లో పోటీ చేయకుండానే సిఎంను చేసేశారు ఆయన ఫ్యాన్స్. 


అది ఎక్కడ ఏంటి అని వివరాలు తెలియదు కాని ఈమధ్య పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్ కు వెళ్లేప్పుడు మధ్యలో రోడ్డంతా ఫ్యాన్స్ తో నిండి ఉన్నదట. ఇక వారి కేకలకు పవన్ కారు దిగి అభివాదం చేయక తప్పలేదు. అయితే అక్కడ ఫ్యాన్స్ ఏకంగా పవర్ స్టార్ ను సిఎం.. సిఎం అని కేకలేయడం అందరిని ఆశ్చర్య పరచింది. ఆంధ్రాలో డైరెక్ట్ గా 2019 ఎన్నికల్లో పాల్గొనబోతున్న జనసేన పార్టీ తెలంగాణాలో కూడా పార్టీ పోటీకి సిద్ధమవుతుందని తెలుస్తుంది.


మరి ఎక్కడ సిఎం అవుతాడో కాని పవన్ ఫ్యాన్స్ మాత్రం సిఎం సిఎం అని పవన్ ను సిఎం చేసేశారు. ఈ ఊపు చూస్తుంటే నిజంగానే పవన్ రాజకీయ ప్రక్షాళణ చేసేయడం ఖాయమనిపిస్తుంది. సిఎం అనే పిలుపు బాగుంది.. అర్హత పుష్కలంగా ఉన్నా పార్టీ పోటీ చేసే మొదటి సంవత్సరమే చక్రం తిప్పేస్తాడా అని కొందరు మాట్లాడుతున్నారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: