taran adarsh కోసం చిత్ర ఫలితం


ఇప్పటికే 'బాహుబలి, ది కంక్లూజన్'  సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోలకు, నిర్మాతలకు,  ఇతర ఫిల్మ్ మేకర్సుకు గట్టి సవాలునే విసిరింది టాలీవుడ్ బాహుబలి.  బాహుబలి ఇచ్చిన పంచ్ నుండి ఇంకా ఊపిరి పీల్చుకోకముందే  ఇప్పుడు అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీ 'డిజె-దువ్వాడ జగన్నాధం'  తో మరో స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. అందుకే బాలీవుడ్ లో సినీ విశ్లేషకుడు, సినీ వ్యాపార నిపుణుడు ట్రేడ్  అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ చేసి బాలీవుడ్ కి  "నిద్రమత్తు వదలమని" సలహా ఇచ్చాడు. 


ఈ సంవత్సరం బాహుబలి ది కంక్లూజన్ తెలుగు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనే  కాదు,  దేశంలోనే కాదు,  ప్రపంచం లోనే ఒక సంచలనం నమోదు చేసింది. ఇంత వరకు భారతీయ సినీ జగత్తులోనే ఎన్నడూ ఊహించని  "వసూళ్ళు వర్షం"  కురిపించింది. బాహుబలి ది కంక్లూజన్ చేసిన వసూళ్ళు ఇప్పటిలో ఏ  ప్రాంతీయ చిత్రం కూడా చేయలేనంత   "వసూళ్ళ హద్దు" ను చేరిపేసి నూతన ముద్రను లిఖించింది. ట్రెండ్-సెట్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ డిజె-దువ్వాడ జగన్నాధం సినిమా విడుదలై మంచి కలెక్షన్లు తోనే నడుస్తుంది. అంతర్జాతీయ సినీ ట్రేడ్, నిశిత విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఇదే విషయాన్ని ఇలా ట్వీట్ చేశాడు 

bahubali 2 - anushka prabhas images కోసం చిత్ర ఫలితం

"డియర్ బాలీవుడ్ నిద్ర నుండి మేల్కొనండి. మొదట బాహుబలి ది కంక్లూజన్, తరవాత డిజె-దువ్వాడ జగన్నాధం తెలుగు సినిమా అమెరికా మార్కెట్ లో దూసుకు పోతుంది. దువ్వాడ జగన్నాధం ఇప్పటికే రూ.3.39 కోట్లు వసూళ్ళు సాధించింది”  అని అన్నారు.


ఇది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ "ట్యూబులైట్" సినిమా కన్నా మంచి వసూళ్ళు సేకరించిందని ఇప్పటికే చెప్పుకున్నాం. అయితే ఒక ప్రసిద్ధ సినీ విమర్శకుడు, వ్యాపార విశ్లేషకుడు క్రిటిక్ కం సినీ ట్రేడ్ అనలిష్ట్ ఈ విధంగా కామెంట్ చేయడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. 

tube light vs DJ కోసం చిత్ర ఫలితం

దీనిపై వివరణ ఇచ్చిన తరణ్ ఆదర్శ్ - బాహుబలి దువ్వాడ లాంటి ప్రాంతీయ సినిమాల విజయ వీర విహారం చూసైనా బాలీవుడ్లో  "ఫిల్మ్ మేకర్స్, స్టార్ హీరోస్ మరిన్ని మంచి సినిమాలు తీస్తారని అలాంటి సిమిమాలు వస్తాయని ఆశిస్తున్నా"  అంటూ కామెంట్ చేశాడు. సల్మాన్ ఖాన్ సినిమా  "ట్యూబులైట్" సరిగా వెలగలేదని వెలుగులు చిమ్మలేదని అన్నారు. 

tube light vs DJ కోసం చిత్ర ఫలితం

ట్యూబులైట్ బాక్స్ ఆఫీసు వద్ద ఆశించినంత ఫలితాలు ఇవ్వలేక పోయిందని సినిమా రిలీజ్ కు ముందు మనోడు అదే బాలీవుడ్ సూపర్ స్టార్ "నాకు 1 స్టార్ ఇచ్చినా పర్లేదు అనడం, ఇప్పుడు ఒక తెలుగు సినిమాకంటే తక్కువ వసూలు చేయడం, యుద్ధానికి ముందే ఆయుధం వదిలేసిన తీరు ఇప్పుడు బాలీవుడ్ ను కలవరపెడుతోంది.


వన్-వర్డ్ రివ్యూ పేరుతో బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సినిమా తనను నిరాశకు గురిచేసిందని ఒక్క మాట లో తేల్చేశారు. సల్మాన్ ఖాన్ వంటి గొప్పస్టార్ ఉన్నా, స్టన్నింగ్ విజువల్స్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తించినా లాభం లేకుండా  పోయిందన్నారు. సీన్లు రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా విజువల్ వండర్‌గా ఉన్నా, కథ చప్పగా ఉండటంతో సినిమా తేలి పోయిందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: