సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ మూవీ నుండి 5 నిమిషాల ఫైట్ సీన్ యూట్యూబ్ లో లీక్ అయ్యింది. సినిమాలో మహేష్ కు విలన్ గా డైరక్టర్ ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. రోడ్ మీద జరిగే ఈ ఫైట్ మొత్తం 5 నిమిషాలు లీక్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఫైట్ సీన్స్ చూసి సినిమా మీద మరింత అంచనాలు పెంచుకున్నారు అభిమానులు.


సైన్స్ ఫిక్షన్ స్టోరీతో వస్తున్న స్పైడర్ మూవీను తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.


సినిమాలో మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నారు. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మురుగదాస్ తో మహేష్ చేస్తున్న ఈ స్పైడర్ నాన్ బాహుబలి రికార్డులను క్రాస్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. రీసెంట్ గా సినిమా టీజర్ భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: