రామ్ చరణ్ ఉపాసనల జంటను చూసి మెగా అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది చాల స్టైలిష్ గా కనిపించే ఈ జంటను మెచ్చుకోకుండా ఉండలేరు. అందువల్లనే వీరిద్దరూ ఏదైనా ఫంక్షన్ కు వస్తే చాలు మీడియా కెమెరాలు అన్నీ వీరిద్దరి పైనే దృష్టి పెడతాయి. 

కేవలం రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో అదేవిధంగా సేవా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఉపాసన. తరుచూ చరణ్ నటించే సినిమాల అవుట్ డోర్ షూటింగ్ స్పాట్స్ లో హడావిడి చేసే ఉపాసన తరుచూ చరణ్ తో విదేశీ ట్రిప్స్ కూడ వేస్తూ ఉంటుంది.

ఈమధ్యనే హిమాలయాల ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వీరిద్దరూ ప్రస్తుతం వారివారి కేరియర్లలో చాల బిజీగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఉపాసనకు ప్రముఖ మహిళా మ్యాగజైన్ ‘ఫెమీనా’ జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆమెకు అవార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఈ వార్తవిని జోష్ లోకి వెళ్ళిపోయిన రామ్ చరణ్ ఉపాసనకు ఈ అవార్డ్ రావడం పై స్పందిస్తూ  ‘ప్రౌడ్ ఆఫ్ యూ ఉప్సీ’ అంటూ సోషల్‌ మీడియాలో ఆమెను అభినందిస్తూ మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ చూసిన తరువాత మాత్రమే చరణ్ తన భార్య ఉపాసనను ముద్దుగా ‘ఉప్సీ’ అని పిలుస్తాడు అన్న విషయం బయట పడింది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: