తెలుగు ఇండస్ట్రీలో  వరుస సక్సెస్‌లతో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా 'నిన్ను కోరి' చిత్రంతో ట్రిపుల్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. నాని, నివేద థామస్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి., కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా శ్రీమతి డి. పార్వతి సమర్పణలో శివ నిర్వాణని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'నిన్నుకోరి'. గోపీ సుందర్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది.
Image result for nani nuku kori posters
ముఖ్యంగా 'బ్రేకప్‌,, అడిగా.. అడిగా, 'ఒన్స్‌ అప్‌ ఆన్‌ ఎ టైమ్‌' పాటలు సూపర్‌హిట్‌ అయి సంగీత ప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది.  తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది , క్లీన్ యు సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా దక్కాయి.  సినిమా చక్కటి ప్రేమ కథ అని సింపుల్ అండ్ స్వీట్ గా ఉందని దక్కాయి . మంచి సినిమాని నిర్మించారని దర్శక నిర్మాతలను అభినందించారట .

అంతేకాదు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు . దాంతో నిన్ను కోరి చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది.  ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ. జూలై 7న రిలీజ్ అవుతున్న నిన్ను కోరి చిత్రం కోసం ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: