ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ తరువాత అతడి వారసుడుగా టాలీవుడ్ కామెడీ కింగ్ అవుతాడు అని భావింపబడ్డ అల్లరి నరేష్ సినిమాలు ఒకప్పుడు నిర్మాతలకు బయ్యర్లకు మినుమం గ్యారెంటీ మూవీలు. గతంలో సంవత్సరానికి మూడు సినిమాలు తక్కువ లేకుండా అల్లరోడు సినిమాలు ఉండేవి. అయితే ఇప్పుడు ఈ కామెడీ హీరో సినిమాలను తీసే నిర్మాతలు మాత్రమే కాదు ఇతడితో నటించడానికి ఏ హీరోయిన్ ఇష్టపడటం లేదు అన్నది లేటెస్ట్ గా వస్తున్న కామెంట్స్. 

ఈ పరిస్థుతులలో వరస పరాజయాలతో సతమతమవుతున్న ఈ హీరోను చూసి ఎవరైనా పలకరించకుండా జాలి చూపులు చూడటం తాను తట్టుకోలేకపోతున్నాను అంటూ నరేష్ ఈమధ్య తనపై తానే జోక్ చేసుకున్నాడు. అంతేకాదు తన సినిమాల ఎంపికలో జరిగిన పొరపాట్ల వల్ల ఫెయిల్యూర్స్ వచ్చాయి కాని ప్రేక్షకులలో తన క్రేజ్ తగ్గిపోవడం వల్ల కాదు అని అంటున్నాడు ఈ ఒకనాటి కామెడీ కింగ్.

అంతేకాదు ‘‘పాపం.. నరేష్ కు ఒక హిట్ వస్తే బావుంటుంది అని నా మీద అభిమానంతో ఎవరైనా జాలిగా చూడటం బదులు మంచి సలహాలు ఇస్తే బాగుంటుంది కదా’ అంటూ తన విమర్శకుల పై రివర్స్ సెటైర్లు వేస్తున్నాడు. అదే విధంగా తాను చేసిన తప్పుల వల్ల తనకు పరాజయాలు ఎదురయ్యాయి అని అంగీకరిస్తూ ఇక పై తన గత సినిమాలలోని విధంగా  స్పూఫ్ కామెడీలు చేయడానికి అంగీకరించటం లేదు అన్న తన యాక్షన్ ప్లాన్ ను వివరించాడు.

ప్రేక్షకులు గత దశాబ్దo క్రితం వచ్చిన జోక్స్ ను తిరిగి మార్చి చెపితే అంగీకరించే స్థితిలో లేరు అన్న వాస్తవం అర్ధం అయింది అని అంటున్నాడు. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు కాబట్టి అల్లరి నరేష్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘మేడ మీద అబ్బాయి’ సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: