కథ కథనాలు బాగుంటే చాలు అది పెద్ద హీరో సినిమానా లేక చిన్న హీరో సినిమానా అని తేడా లేకుండా సిని అభిమానులు సినిమాను సక్సెస్ చేస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ లిమిట్ తో తీసే చిన్న సినిమాలకు మంచి రోజులొచ్చాయని చెప్పాలి. మంచి కంటెంట్ తో వస్తే ఆడియెన్స్ తప్పక ఆదరిస్తారని మరోసారి ఓ చిన్న సినిమా సక్సెస్ తో రుజువైంది.


రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న చిన్న సినిమా అమితుమి. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అడవి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్ కలిసి నటించారు. జెంటిల్మన్ తర్వాత ఇంద్రగంటి తీసిన ఈ సినిమా పాతిక రోజులు 60 కేంద్రాల్లో పూర్తి చేసుకుంది. సినిమా కొన్న వారందరికి లాభాలు తీసుకు వచ్చిన ఈ సినిమా శాటిలైట్ రూపంలో రెండున్నర కోట్లను సాదించిందట.


ఆరోగ్యకరమైన కామెడీతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన అమితుమి చిన్న సినిమాల్లో పెను సంచలనం సృష్టించిందని అంటున్నారు. లో బడ్జెట్ మూవీస్ లో ఈ ఇయర్ హిట్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అడివి శేష్, ఈషా రెబ్బ నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: