క్రేజీ డైరక్టర్ కృష్ణవంశీ సినిమాల్లో హీరోయిన్స్ అంటే స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నట్టే. కెవి చేతిలో పడితే హీరోయిన్ ఫేట్ మారినట్టే అన్న మాట నిజం చేస్తూ హీరోయిన్ లోని అన్ని కోణాలను తెర మీద ఆవిష్కరిస్తాడు కృష్ణవంశీ. చందమామగా కాజల్ ను ఓ రేంజ్ లో చూపించి ఆమె కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చిన కృష్ణవంశీ ఇప్పుడు అదే తరహాలో రెజినాను చూపించేస్తున్నాడు.


కృష్ణవంశీ డైరక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా నక్షత్రం. రెజినా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ఈరోజు రిలీజ్ కానుంది. సినిమాలో సాయి ధరం తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా స్పెషల్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఆడియో రిలీజ్ పోస్టర్స్ లో హీరోయిన్ అందాలతో డిజైన్ చేసిన కృష్ణవంశీ పెద్ద స్కెచ్ వేశాడని అనిపిస్తుంది.


రెజినాను మాత్రం ఏ సినిమాలో చూడని హాట్ అండ్ క్యూట్ గా నక్షత్రంలో చూపించారని అంటున్నారు. సినిమాలో పోస్టర్స్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. కెవి డైరక్షన్ లో హీరోయిన్స్ స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుంది. అందుకే నక్షత్రం తర్వాత రెజినా మళ్లీ ఫాంలోకి రావడం కన్ఫాం అంటున్నారు. తనిష్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల చివరి వారంలో రిలీజ్ అవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: