తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో అతిలోక సుందరిగా అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇక తెలుగు లో ఈమె నటించిన చిత్రాలు దాదాపు అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి.  బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ని వివాహమాడింది.  ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి ‘ఇంగ్లీష్..వింగ్లీష్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.  
Image result for mom movie
తమిళ, హిందీ భాషల్లో మరోసారి తన సత్తా చాటుతుంది. తాజాగా శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయ్యింది.  తెలుగులో శ్రీదేవి ఆ మద్య ప్రమోషన్ కోసం వచ్చిన విషయం తెలిసిందే. అయితే మామ్ సినిమా గురించి ప్రస్తావిస్తూ..ఓ తల్లి పడే ఆవేదన ఎంత బాధాకరంగా ఉంటుందో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారని చెప్పింది.  అయితే శ్రీదేవి చిత్రం అనగానే మంచి నటన ఉంటుంది కనుక సినిమాపై నమ్మకంతో ఈ సినిమా కుసరైన పబ్లిసిటీ చేయలేదు సరికదా ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షో వేశారు కూడా.
Image result for ninnu kori movie
అనుకున్నట్టుగానే సినిమాలో శ్రీదేవి నటనకు మంచి మార్కులే పడినట్లు తెలుస్తుంది. అయితే తెలుగులో ఈ రోజు నానీ చిత్రం ‘నిన్ను కోరి’ చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంపై కొన్ని చోట్లు పాజిటీవ్ టాక్ వచ్చింది. మరి శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రం పరిస్థితి ఎలా ఉంటుందో..తెలుగు అభిమానులు ఈ సినిమాను ఎంత వరకు ఆదరిస్తారో..అసలు సినిమా హిట్టా..ఫట్టా అనేది రేపటి కలెక్షన్లను బట్టి తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: