బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు సర్కస్ అనే హిందీ సీరియల్ లో నటించాడు.  తర్వాత బాలీవుడ్ లో నెగిటీవ్ రోల్స్ తో ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ తర్వాత హీరోగా మారారు.  ఇక దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రం తర్వాత మనోడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.  రోమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షారూఖ్ తిరిగి వెనక్కి చూసుకోలేదు.  నటుడుగా, నిర్మాతగా,వ్యాఖ్యాతగా అన్ని రంగాల్లో తనదైన స్టైల్ చూపించాడు.  తాజాగా షారూఖ్ ఖాన్ ఓ బస్సులు సర్కస్ విన్యాసాలు చేశాడు.
Image result for shahrukh khan anushka new film
అదేంటీ షారూఖ్ సర్కాస్ విన్యాసాలు చేయడం ఏంటీ..ఆయనకేం అవసరం అని అనుకుంటున్నారా..! నిజమండీ..ఆయన బస్సులో ప్రయాణించి.. ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు.  షారూక్ బస్సెక్కడం ఓ ఆశ్చర్యమైతే.. ఆ బస్సులో షారూక్ చేసిన విన్యాసం మరో ఆశ్చర్యమనే చెప్పాలి. నిలబడి ప్రయాణించేటప్పుడు సపోర్ట్ నిమిత్తం బస్సు లోపల ఉండే క్లాత్ బెల్టులను పట్టుకున్న షారూక్, అమాంతం పైకి లేచి పిల్లిమొగ్గ వేశాడు.  
Image result for shahrukh khan anushka new film
అయితే అసలు విషయానికి వస్తే..షారూక్ సరసన అనుష్క శర్మ నటించిన  ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ ప్రమోషన్ కోసం ఈ మద్య షారూఖ్, అనుష్కలు రక రకాలుగా అభిమానులను కలుస్తున్నారు.  ఇందులో భాగంగానే షారూఖ్ బస్సు లో ఇలాంటి విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.  

ఈ వీడియోను ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వచ్చే నెల 4న విడుదల కానున్న ఈ చిత్రం కానున్నది. కాగా, షారూక్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబయ్ సిటీ బస్సులో ఈ విన్యాసం చేశాడని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: