లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించిన నితిన్ లాస్ట్ ఇయర్ అఆతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన నితిన్ హను రాఘవపుడితో లై సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం టీజర్ రిలీజ్ అవ్వగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.


అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాల తర్వాత హను రాఘవపుడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. టీజర్ లో నితిన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏంటి అంటే సినిమాలో విలన్ గా యాక్షన్ హీరో అర్జున్ నటిస్తుండటమే.


ఒకప్పటి స్టార్ హీరో అర్జున్ ఈ సినిమాలో విలన్ గా తన విశ్వరూపం చూపించబోతున్నారు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా టీజర్ లోనే హను టాలెంట్ ఏంటో అర్ధమయ్యింది. మళ్లీ తన మార్క్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు నితిన్.



మరింత సమాచారం తెలుసుకోండి: