తెలుగు ఇండస్ట్రీలో ‘జయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ తర్వాత వచ్చిన ‘దిల్’ చిత్రంతో మంచి విజయం సాధించాడు.  ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా..ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే రెండు సూపర్ డూపర్ హిట్ సాధించాయి.  ఆ తర్వాత వచ్చిన చిన్నదాన నీకోసం ఫ్లాప్ కావడంతో డీలా పడిపోయిన్ నితిన్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రం మంచి విజయం సాధించింది.  ఇండస్ట్రీకి నితిన్ ఎంట్రీ ఇచ్చి పన్నెండు సంవత్సరాలు దాటింది..ఇప్పటికీ సరైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేక పోయాడు.  

ఆ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ మంచి ఘన విజయం సాదించడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా నితిన్ కెరీర్ లో రికార్డు స్థాపించింది.  తాజాగా . హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘లై’ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్.  ఇప్పటికే ఫస్ట్ లుక్, సాంగ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

టీజర్‌లో ‘కోట్లమంది సైనికులు సరిపోలేదట..పంచపాండవులూ సాధించలేదట..చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట, అశ్వాత్థామ హత:కుంజర:’ అంటూ సరికొత్తగా ఉన్న డైలాగ్ వెర్షన్ చూస్తుంటే సినిమా యాక్షన్ మూవీ అని తెలుస్తుంది.  మరి యాక్షన్ తో పాటు ఎంట్ర టైన్ మెంట్, సెంటిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో ట్రైలర్ చూస్తే కానీ తెలియదు.
Image result for LIE Movie
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా నటిస్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: