టైటిల్ తోనే ఆసక్తి రేపుతున్న 'లై' చిత్ర బృందం తమ టీజర్ తో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ లు ట్రైలర్ లే ఏ సినిమాకి అయినా ముఖ్యమైన వనరు గా నిలబడతాయి అలాంటి లై టీజర్ ఇప్పుడు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. నితిన్ హీరోగా డైరెక్టర్ హను రాఘాపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టింది.


లై అంటే అబద్ధం , అలాంటి ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టడం తోనే ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. అందాలా రాక్షసి - కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ హను క్లాసి టచ్ తో అలానాటి యాక్షన్ హీరో అర్జున్ ని విలన్ గా చూపిస్తూ ఈ సినిమా తీసాడు. ఆగస్ట్ 11 న సినిమా విడుదల కి సిద్దం అవుతూ ఉండగా ప్రమోషన్ లు నిన్నటితో మొదలు పెట్టారు.


నితిన్ పాత్ర ఎంత కీల‌క‌మో.. అర్జున్ పాత్ర కూడా అంతే బ‌లంగా ఉంటుంద‌న్న సంగ‌తి లై టీజ‌ర్ తో అర్థ‌మైంది. ‘లై’ లైన్‌, టీజ‌ర్ అదిరిపోయాయి. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అబద్ధం అనేది లేకుండా జీవితం ఉండదు అనీ , కురుక్షేత్ర సంగ్రామం కూడా అబద్ధం లేకుండా జరగలేదు అనీ అలాంటిది జీవితం లో అత్యంత ముఖ్యమైన ఘట్టాలకి అబద్ధం చాలా కీలకం అనీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: