ప్లయింగ్ సిఖ్ మిల్కాసింగ్ జీవిత కధ ఆదారంగా తెర‌కెక్కిన బాగ్ మిల్కా బాగ్ బాక్సాఫీస్ ద‌గ్గర క‌లెక్షన్ల వ‌ర్షం కురిపిస్తుంది. లాస్ట్ ప్రైడే ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఇండియాలోనే కాదు అమెరికాలోనూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అది ఎంత‌గా అంటే హాలీవుడ్ సినిమాల‌కు దీటుగా దుమ్మురేపుతోంది.
��
రాకేష్ ఓం ప్రకాష్ డైరెక్షన్ లో  ఫ‌ర్హాన్ అక్తర్, సోన‌మ్ క‌పూర్ న‌టించిన ఈ చిత్రం అమెరికాలో ఈ వారం అత్యధిక ప్రజాద‌ర‌ణ పొందిన సినిమాల జాబితాలో 15వ స్ధానం ద‌క్కించుకుని ఇండియ‌న్ సినిమా ప‌వ‌ర్ ఏంటో ప్రూవ్ చేసింది. అమెరికాలో దాదాపు 140ధియేట‌ర్లలో ప్రద‌ర్శింప‌బ‌డుతున్న ఈ చిత్రం మూడు రోజుల్లోనే నాలుగు కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్టుగా వాషింగ్ ట‌న్ పోస్ట్ త‌న క‌ధ‌నంలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: