ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఎవ్వరి నోట విన్నా ‘బిగ్ బాస్’ షో గురించిన ప్రస్తావనే..ఎందుకంటే మొట్ట మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న కార్యక్రమం కావడంతో దీనికి అంత ప్రాధాన్య వచ్చింది. ఈ షో మొదటి రోజే జనాలు కాస్త నీరుగారిపోయినంత పని అయ్యింది. ఈ షోలో ఫేడ్ అవుట్ అయిన వారే ఎక్కువ కనిపించడంతో బిగ్ బాస్ షో పై కొంత మంది పెదవి విరిచారు.
అంతే కాదు ఈ ప్రోగ్రామ్ మొదటి నుంచి చప్పగా కొనసాగుతూ వస్తుంది. దీంతో బిగ్ బాస్ కి కొత్త వన్నెలు తీసుకు రావాలన్న ఆలోచలో ఇప్పటికే జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో బాగా ఫేమ్ అయిన హాట్ యాంకర్ అనసూయ రంగంలోకి తీసుకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తల గురించి ట్విట్టర్ ద్వారా స్పందించింది అనసూయ. ‘‘బిగ్‌బాస్’ చేసేంత టైమ్ నాకు లేదు.
ప్రస్తుతానికి సినిమాలు, టీవీ ప్రోగ్రామ్‌లతో చాలా బిజీగా ఉన్నాన’ని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అనసూయ మాత్రం తన చుట్టూ విన్పిస్తోన్న 'బిగ్‌బాస్' గాసిప్స్‌ని కొట్టి పారేసింది. తనకు అంత టైమ్ లేదని తేల్చి చెప్పేసింది. టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నానని అనసూయ ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చేసింది.