అనుకొన్నదంతా అయ్యింది. శింబు, హ‌న్సిక‌లు ప్రేమ‌లో ప‌డ్డార‌ని, త్వర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు కొంత‌కాలం నుంచి కోడై కూస్తున్నాయి. అయితే శింబు, హ‌న్సిక‌లు మాత్రం పెద‌వి విప్పలేదు. అబ్బే అలాంటిదేం లేదు.. అని స‌మాధానం దాటేశారు. ఇప్పుడు ఒక్కో నిజం బ‌య‌ట‌ప‌డుతోంది. ``నేను ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆ వ్యక్తి మీ అంద‌రికీ తెలుసు...`` అని హ‌న్సిక ట్విట్ చేసింది. అదే స‌మయంలో శింబు కూడా.. ``త్వర‌లోనే పెళ్లి చేసుకొంటున్నా...`` అని స‌న్నిహితులుతో చెబుతున్నాడ‌ట‌. దాంతో ఈ పెళ్లి వార్తకు మ‌రింత బ‌లం వ‌చ్చింది. న‌యన‌తార‌తో తూచ్ చెప్పేశాక శింబు హ‌న్సిక‌తో ప్రేమాయణం మొద‌లుపెట్టాడ‌ని మీడియా.. ప్రచారం చేసింది. ఒక్కసారి కూడా దానిని ప్రతిఘ‌టించ‌ని ఈ జంట ఇప్పుడు బ‌య‌ట‌ప‌డిపోయింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి క‌బురు అందొచ్చు. శుభ‌లేఖ‌ల కోసం వెయిట్ అండ్ సీ...

మరింత సమాచారం తెలుసుకోండి: