దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన ‘చంద్రముఖి’ సినిమా పేరు చెప్పగానే ఆ సినిమాలో రజినీ పలికిన ‘లకలక లకలక’ డైలాగ్ అందరికీ గుర్తుకు వస్తోంది. ఆ డైలాగ్ సూపర్ హిట్ కావడంతో ఆ డైలాగ్ ను పేరడీ చేస్తూ అనేకమంది ప్రముఖ కమెడియన్ లు కూడా రజినీ లా నటించి మెప్పించారు. అంతేకాదు ఆ డైలాగ్ ఇప్పటికీ పిల్లల మనస్సులో ఉండిపోయి వారు ఒక్కరినిఒకరు భయపెట్టుకోవడానికి ఈ డైలాగ్ ను వాడుతూనే ఉంటారు. ఈ సినిమా విడుదల అయి ధశాభ్ధం ధాటిపోయినా ఇంకా జనం మధ్య ఆ డైలాగ్ బ్రతికే ఉంది.

ఇంత పాపులర్ అయిన ఈ డైలాగ్ ఎలా పుట్టిందో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.  చంద్రముఖి సినిమాను కన్నడం లో విష్ణు వర్ధన్ నటించి సూపర్ హిట్ అయిన ‘నాగవల్లి’ కి రీమేక్ గా తమిళంలో నిర్మించారు. నాగవల్లి సినిమాలో హీరో విష్ణు వర్ధన్ ‘హౌల హౌల’ అంటాడు. అదే డైలాగ్ రజినికి చూపెట్టి దర్శకుడు రజినీ స్టైల్ లో చెప్పమని చెప్పాడట. కాని రజినీకాంత్ కు మాత్రం ఈ డైలాగ్ ఎంత బాగా పేలితే ఆ సినిమా అంత హిట్ అవుతుంది అనిపించి, ఈ డైలాగ్ చెప్పే సీన్ కోసం రజినీకాంత్ వారం రోజులు ఆలోచించాడట. కాని సరైన పవర్ ఫుల్ డైలాగ్ అతడి మనస్సు కు తట్టలేదట.

ఇక ఏమి చెయ్యాలో అర్ధంకాక నిరాశతో ఉన్న రజినికి అనుకోకుండా ఆయన చాలారోజుల క్రితం చూసిన ఒక మరాఠి డ్రామా గుర్తుకు వచ్చిందట. ఆ డ్రామాలో విలన్ లకలక లకలక అంటూ హడావుడి చేస్తాడు. ఆ డైలాగ్ ను గుర్తుకు తెచ్చుకొని రజినీ తనదైన స్టైల్ లో చెప్పేసరికి ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. కాని ఒక్క డైలాగ్ కోసం వారం రోజులు ఆలోచించే హీరోలు ఇప్పుడు ఉన్నారా..? అన్నదే ప్రశ్న. అందుకే రజినీ సూపర్ స్టార్ గా ఎదిగాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: