ఓం సినిమా ట్రైల‌ర్లు చూసి మ‌నం అంచ‌నాలు పెంచుకొన్న‌ట్టుగానే రామ్ చ‌ర‌ణ్ కూడా ఆ సినిమా పై చాలా హొప్స్ పెట్టుకొన్నాడు. ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డి ఓం లోని కొన్ని సీన్స్ చ‌ర‌ణ్‌కి చూపించాడు కూడా. ఇద్ద‌రికీ మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది లెండి. అదీ రీజ‌న్‌. అవి చూసి చ‌ర‌ణ్ థ్రిల్ అయిపోయాడు. అందుకే `నీతో ఓ సినిమా చేస్తా..` అని మాట కూడా ఇచ్చాడు.

తీరా ఇప్పుడు ఓం రిజ‌ల్ట్ చూస్తే... చ‌ర‌ణ్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిపోయుంటుంది. సినిమాని అర్థం ప‌ర్థం లేని ట్విస్టుల‌తో నింపేసి... టెక్నిక‌ల్ ఎఫెక్ట్‌ని పాడుచేసేశాడు. ఈ సినిమా చూసిన‌వాళ్లంతా ముక్త‌కంఠంతో చెబుత‌న్న మాట ఒక్క‌టే. డైరెక్ష‌న్ బాగోలేద‌ని. ఇంత మంచి పేరుతెచ్చుకొన్న ద‌ర్శ‌కుడితో రామ్‌చ‌ర‌ణ్ జ‌త క‌ట్ట‌డం అసాధ్య‌మే.


అందుకే మెల్ల‌గా జారుకొనే ప్ర‌య‌త్నాలు మొదలు పెట్టేశాడ‌ట‌. సునీల్ ఫోన్ కూడా లిఫ్టు చేయ‌డం లేద‌ట‌. తెలిసి తెలిసి ఎవ‌రు ఓ ఫ్లాప్ సినిమా ఒప్పుకొంటారు చెప్పండి??

మరింత సమాచారం తెలుసుకోండి: