సునీల్ హీరోగా మారాక తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. డాన్సులు, ఫైట్లూ అంటూ తన రేంజు చూపించుకోవాలి క‌దా?  అందుకోసం తెగ మెలిక‌లు తిరిగిపోయాడు. ఇప్పుడు ఆ డాన్సులే... ఇప్పుడు సునీల్‌కి క‌ష్టాల్లో ప‌డేశాయి. సునీల్ కుడి కాలు కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతోంద‌ట‌. ఆ బాధ నంతా ఓర్చుకొని త‌డాఖాలో స్టెప్పులు వేశాడ‌ట‌. ఇప్పుడు ఆ బాధ తిర‌గ‌బ‌డింది.

సునీల్ కుడికాలుకి ఆప‌రేష‌న్ చేయాల‌ట‌!  దాంతో రెండు వారాల పాటు షూటింగుల‌కు దూర‌మవుతున్నాడు అందాల రాముడు.. ``ఆప‌రేష‌న్ కాదు.. కానీ ఆప‌రేష‌న్ లాంటిదే. కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు..`` అని సునీల్ స‌న్నిహితులు చెబుతున్నారు. హీరో అయ్యాక ఇలాంటి క‌ష్టాలూ ఉంటాయ్ మ‌రి!

మరింత సమాచారం తెలుసుకోండి: