కుదిరితే ఒక కప్పు కాఫీ, వీలైతే రెండు మాట‌లు అంటూ టాలీవుడ్ అల్లరి హీరోయిన్ జెనీలియా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రితేష్ దేష్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని ఎంచ‌క్కా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి త‌రువాత జెనీలియా రీ ఎంట్రి గురించి తెగ ఇబ్బంది ప‌డుతున్నట్టు టాలీ స‌మాచారం.

జెనీలియా భ‌ర్త రితేష్ మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ మూవీల స్పీడు పెంచాడు. ఏమైందో ఏమో తెలియ‌దుకాని ఇత‌గాడు ఓ బూతు సినిమాలో న‌టించేందుకు సిద్దమ‌య్యాడు. ఒక్క రితేష్‌దేష్‌ముఖ్ మాత్రమే కాదు రీసెంట్‌గా పెళ్ళి అయిన హీరో వివేక్ ఒబేరాయ్ కూడ ఆ బూతు ఫిల్మ్‌లో న‌టిస్తున్నాడు. అదే బాలీవుడ్ గ్రాండ్‌మ‌స్తి ఫిల్మ్‌.

లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఈ ట్రైల‌ర్ నిండా బూతులమ‌యం. చెప్పుకుంటే సిగ్గుపోద్ది అంటారు క‌దా అలా ఉంది ఈ ట్రైల‌ర్‌. వివేక్ ఒబెరాయ్‌,రితేష్ దేష్‌ముక్ న‌టించిన ఈ మూవీను బి-టౌన్‌లో చిన్న చూపుచూస్తున్నారు. పైగా ఈ మూవీ పెద్దల‌కు మాత్రమే, ఎట్టి ప‌రిస్థిల్లో చిన్నవాళ్ళు చూడొద్దు,రావ‌ద్దు అని స్టేట్‌మెంట్ కూడ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: