సినిమా ఇండస్ట్రీలో చాన్స్ రావడమే గొప్ప అనుకునే ఈ కాలంలో కొంత మంది నటులు చేసే పొరపాటు వల్ల వారి కెరీర్ అనుకోకుండా పతనం అవుతుంది. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి..తాజాగా మళియాళ హీరో దిలీప్ తాను చేసిన అపరాదానికి ఇప్పుడు జైళ్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.  తన పర్సనల్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనను ఇబ్బంది పెట్టందని భావించి..తమిళ నటి భావనపై కుట్రపన్ని ఆమె డ్రైవర్ తో లైంగిక వేధింపులు చేసేందుకు వారిని పురిగొలిపినట్లు కోర్టు లో తేలడంతో దిలీప్ ని జైలుకు పంపిన విషయం తెలిసిందే.
Image result for dileep's bail plea
  కాగా, తాను కొన్ని సినిమాలు ఒప్పుకున్నానని తాను జైల్లో ఉండటం వల్ల వారికి నష్టం వాటిల్లుతుందని తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా పలు మార్లు కోర్టులో విన్నవించుకున్నాడు..కాని  ఫలితం మాత్రం శూన్యం. తాజాగా నటుడు దిలీప్ కు  కేరళ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దిలీప్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

బెయిల్ ఇస్తే సాక్షులను ప్రలోభపెట్టే అవకాశముందని..బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దిలీప్ కు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉన్నాయని కేరళ హై కోర్టు చెప్పింది. మొన్నటివరకు గ్రాండ్ గా 50 రోజులు, వంద రోజుల వేడుకలు చేసుకున్న ఇప్పుడు జైళ్లో 50రోజులు పూర్తిచేసుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: